హైదరాబాద్ నేరేడ్ మెట్ లో మైనర్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగింది. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరేడ్ మెట్ తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు యువకులు. కాచిగూడలో ఉంటున్న మైనర్ అమ్మాయికి గంజాయి అలవాటు చేశారు యువకులు. మైనర్ అమ్మాయి గంజాయి మత్తులోకి దిగగానే అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది మైనర్ అమ్మాయి.
మైనర్ అమ్మాయి శరీరంలో మార్పులు రావడంతో గమనించి నిలదీసింది తల్లి. జరిగిన ఘోరాన్ని తల్లికి మొత్తం వివరించి చెప్పింది మైనర్ బాలిక. దీంతో.. తల్లి తన కూతురుతో కలిసి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోక్సో, గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నేరేడ్మెట్ కు బదిలీ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.