నీట్ విద్యార్థిని.. మద్యం మత్తులో బాల్కనీలో సిగరెట్ తాగుతూ బ్యాలెన్స్ తప్పి..

అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీలో నిలబడి తన స్నేహితుడితో మాట్లాడుతూ బ్యాలెన్స్ తప్పి 9వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు.;

Update: 2024-01-24 07:54 GMT

మంగళవారం తన కుటుంబ స్నేహితుడితో పార్టీ చేసుకున్న తర్వాత విద్యార్థిని అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీలో నిలబడి తన స్నేహితుడితో మాట్లాడుతూ బ్యాలెన్స్ తప్పి 9వ అంతస్తు నుంచి పడి మృతి చెందింది.

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని ఘోర ప్రమాదంలో మృతి చెందింది. 24 ఏళ్ల విద్యార్థిని సీతాపూర్ నివాసి. లక్నోలో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతోంది. 

గోల్ఫ్ సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో తన ఫ్యామిలీ ఫ్రెండ్ తో కలిసి పార్టీ చేసుకుంటోంది. పార్టీ అయిపోయిన తర్వాత అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీలో నిలబడి తన స్నేహితుడితో మాట్లాడుతోంది. మద్యం తాగుతూ, సిగరెట్ కాలుస్తూ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. 9వ ప్లోర్ నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీసులు ఆత్మహత్యా, హత్యా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరణించిన విద్యార్థిని కుటుంబం ఇంతవరకు ఎవరిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Similar News