Actress Ranya Rao : యూట్యూబ్లో చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నా : రన్యారావు

Update: 2025-03-13 13:45 GMT

బంగారం స్మగ్లింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానని చెబుతోంది నటి రన్యారావు. ఇటీవల ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డైరెక్ట రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భం గా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోం ది. రెండు వారాలుగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి నాకు కాల్స్ వచ్చాయని, మార్చి 1న ఓ విదేశీ ఫోన్ నంబరు నుంచి ఫోన్ వచ్చిందని తెలిపింది. దుబాయ్ ఎయిర్పోర్టులోని టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ ఏ వద్దకు వెళ్లాలని సూచించారని, అక్కడ బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని చెప్పా రన్నారు. అంతకు ముందు తానెప్పుడూ బంగారం స్మగ్లింగ్ చేయలేదంటోంది. రెండు ప్లాస్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారని తెలిపింది. దాన్ని దాచడం కోసం బ్యాండేజ్ లు, కత్తెరలను ఎయిర్పోర్టులో కొన్నానని చెప్పింది. ఆ తర్వాత రెస్ట్రూమ్కు వెళ్లి ఆ బంగారం కడ్డీలను నా శరీరానికి అతికించుకు న్నాని పేర్కొంది. జీన్స్, బూట్లలో దాచిపెట్టానని వివరించింది. ఇదంతా యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాని తెలిపినట్టు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం తనకు తెలియదని చెప్పారు. అతడి భాష చూస్తే ఆఫ్రికన్ అమెరికన్ లా అనిపించిందని అంటోంది.

Tags:    

Similar News