Ankita Bhandari : అంకిత భండారి హత్య కేసులో మరో ట్విస్ట్..

Ankita Bhandari : ఉత్తరాఖండ్‌లో దారుణ హత్యకు గురైన అంకిత భండారి డెడ్‌బాడీకి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కుటుంబం నిరాకరిస్తోంది;

Update: 2022-09-25 11:00 GMT

Ankitha Bhandari : ఉత్తరాఖండ్‌లో దారుణ హత్యకు గురైన అంకిత భండారి డెడ్‌బాడీకి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కుటుంబం నిరాకరిస్తోంది. పోస్టుమార్టమ్ ఫైనల్‌ నివేదిక వచ్చాకే అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబట్టింది. అంకితా కేసులో విచారణ చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని..ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంకితాకు న్యాయం చేయలంటూ ఉత్తరాఖండ్‌లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఉదయం బద్రినాథ్‌-రిషికేష్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు నిరసనకారులు.

ఐతే ప్రాథమిక నివేదికలో అంకితా నీటిలో మునగడం వల్ల చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. శరీరంపై గాయాలున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఐతే కుటుంబసభ్యులు మాత్రం ఫైనల్ రిపోర్టు వచ్చేంత వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటున్నారు. దీంతో అధికారులు సర్ది చెప్పేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు రిసార్ట్‌ను కూల్చివేయడంపై అంకితా భండారి కుటుంబం తప్పుపట్టింది. ఆధారాలను నాశనం చేసేందుకే రిసార్ట్‌ను కూల్చివేశారని ఆరోపిస్తుంది.

బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్‌ ఆర్య రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే అంకితా వారం రోజుల క్రితం హత్యకు గురైంది. రిసార్ట్‌కు వచ్చే వారితో సన్నిహితంగా మెలగాలని అంకితాను ఒత్తిడి చేశారు పుల్కిత్ ఆర్య. అందుకు అంకితా ఒప్పుకోకపోవడంతో ఆమెను హత్య చేసినట్లు పుల్కిత్ ఆర్య అంగీకరించారు. ఈ కేసులో పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News