Crime : విజయవాడలో దారుణం..మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారం

Update: 2025-09-30 12:00 GMT

విజయవాడ నగర శివారులోని పాయకాపురంలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఆమెను ఆశ్రయం ఇచ్చిన వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు మరణించడంతో ఆమె తన పిన్ని, బాబాయ్ వద్ద ఆశ్రయం పొందుతోంది. ఈ క్రమంలో బాబాయ్ ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.

వైద్య పరీక్షల్లో గర్భం నిర్ధారణ  బాధితురాలైన బాలిక నున్న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక అనారోగ్యంగా ఉండటంతో పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. రక్షణ కల్పించాల్సిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Tags:    

Similar News