చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. తన ‘రామరాజ్యం’ సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను రాఘవరెడ్డి గతంలో కోరారు. ఆయన అంగీకరించకపోవడంతో ఈ నెల 7న ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ కేసులో 22 మందిని నిందితులుగా చేర్చగా, ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ కాగా, 16 మంది పరారీలో ఉన్నారు.