Tollywood Drugs Case: 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆడియో, వీడియో రికార్డింగ్స్ మాయం..!

Tollywood Drugs Case:టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ఆర్థిక లావాదేవీల గుట్టు వీడాలంటే కాల్‌డేటా రికార్డింగ్స్‌ కీలకం అంటోంది ED

Update: 2022-02-14 12:30 GMT

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ఆర్థిక లావాదేవీల గుట్టు వీడాలంటే.. నాటి కాల్‌డేటా రికార్డింగ్స్‌ చాలా కీలకం అంటోంది ED. ఐతే.. ఆ వివరాలు తమకు అందలేదని, వాటిని ఇస్తే దర్యాప్తు ముందుకు సాగుతుందంటూ ఎక్సైజ్‌ శాఖకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్‌కు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్స్ మాయం అయ్యాయి అంటూ వార్తలు కావడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

అప్పట్లో టాలీవు స్టార్స్‌తో పాటు 41 మంది వాంగ్మూలాలను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. దీనిపై 12 FIRలు నమోదు చేశారు. నిందితుడు కెల్విన్ మొబైల్ సైతం సీజ్ చేసిన ఎక్సైజ్‌ శాఖ, కెల్విన్‌తో స్టార్స్‌కు ఉన్న సంబంధాలపై విచారణకు కాల్ డేటాను కీలకంగా ఉపయోగించుకుంది. ఐతే.. ఆ ఆ కాల్ రికార్డింగ్స్‌ ఈడీకి ఇవ్వలేదు. ఆ వివరాలు కావాలంటూ ఇప్పుడు ED నుంచి ఎక్సైజ్ శాఖకు లేఖ పంపింది.

FSL రిపోర్ట్‌లతో పాటు ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్‌ ఇవ్వాలని ED కోరుతోంది. అవన్నీ ట్రయల్‌ కోర్టులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ చెప్తోంది. ఐతే.. కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూల కాపీలు మాత్రమే తమకు అందాయి అని ED చెప్తోంది. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవు అంటున్నారు. అవన్నీ ఇస్తే మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుంటుందంటూ చెప్పుకొస్తోంది.

Tags:    

Similar News