Auto Accident : కాలువలోకి దూసుకెళ్లిన ఆటో .. ప్రమాదంలో ఒకరు మృతి

Update: 2024-10-14 11:45 GMT

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ ట్రాలీ ఆటో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న సరస్వతి ఆలయం పక్కనగల కేఎల్ఐ కాలువలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంతటి గ్రామానికి చెందిన ఫాతిమా బేగం అనే మహిళ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మంతటి గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో అదే గ్రామానికి చెందిన కూలీలను తీసుకొని పొలానికి వెళుతుండగా ఆలయం సమీపంలో కేఎల్ఐ కాల్వ మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడింది. దీంతో మహిళ మృతి చెందగా, పది మందికి గాయాలైనట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News