Hyderabad : ఆటో డ్రైవర్ ఓవరాక్షన్.. బస్ డ్రైవర్‌పై దాడి
Hyderabad : హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్లు చెలరేగిపోతున్నారు. అడ్డంగా ఉన్న ఆటో తీయమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి దిగాడు;
Hyderabad : హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్లు చెలరేగిపోతున్నారు. అడ్డంగా ఉన్న ఆటో తీయమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి దిగాడు. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బర్కత్‌పూరాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించి ముష్టిఘాతాలకు దిగాడు ఆటో డ్రైవర్. స్టీరింగ్‌పై నుంచి కిందకు ఈడ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. ప్రయాణికులు అడ్డుకోవడంతో ఆర్టీసీ డ్రైవర్‌ను విడిచిపెట్టాడు. దాడిపై బస్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.