Bomb Threat : ప్రియుడు తనను ఇష్టపడటం లేదని 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు మెయిల్స్

Update: 2025-08-04 09:00 GMT

తాను ప్రేమించిన వ్యక్తి తనను ఇష్టపడడం లేదనే కోపంతో చెన్నైకి చెందిన మహిళ అతడిని కేసుల్లో ఇరికించేందుకు 12 రాష్ట్రాల్లోని 21 ప్రదేశాలల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపించింది. దాంతో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సదరు మహిళ గతంలో 5 సార్లు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు మెయిల్స్ పంపినట్లు అధికారులు గుర్తించారు. దాంతో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్న సదరు మహిళను శంషాబాద్ పోలీసులు పిటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన రెనే జోషిల్డా (30) చెన్నైలోని డెలాయిట్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నది. తన తోటి ఉద్యోగి దివేజ్ ప్రభాకర్ ను ప్రేమించింది. అయితే ప్రభాకర్ ఆమె ప్రేమను నిరాకరించడంతో అతడిపై కక్ష పెంచుకుంది. తన ప్రియుడిని ఇరికించేందుకు అహ్మదాబాద్, చెన్నై, గుజరాత్, తమిళనాడు, కేరళతో పాటు 12 రాష్ట్రాల్లోని ఎయిర్పో ర్టులతో పాటు 21 ప్రాంతాల్లో బాంబులు పె ట్టినట్లు బెదిరింపు మెయిల్స్ పంపించింది. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కూడా గతంలో రెండు సార్లు బెదిరింపు మెయిల్స్ పంపించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించ డంతో విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Tags:    

Similar News