Visakhapatnam : పెళ్లింట విషాదం.. పెళ్లి పీటలపైనే చనిపోయిన వధువు
Visakhapatnam : విశాఖ మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పీటలపైనే వధువు చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది.;
Visakhapatnam : విశాఖ మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పీటలపైనే వధువు చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ముహూర్త సమయానికి జీలకర్రా బెల్లం పెడుతున్న సమయంలో వధువు సృజన స్పృహ కోల్పోయింది.. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సృజన మృతి చెందింది. అలసట కారణంగా సృజనకు గుండెపోటు వచ్చినట్లు భావిస్తున్నారు. పెళ్లి పీటలపైనే వధువు చనిపోవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.