హైదరాబాద్ ఉప్పల్ బస్టాప్ వద్ద యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. చంపేందుకు ప్రయత్నం చేసాడు. కానీ అదృష్టవశాత్తూ అమ్మాయి స్వల్ప గాయాలతో తప్పించుకుంది. భువనగిరి చెందిన సాయికుమార్, రంభ అనే ఇద్దరు విద్యార్థులు గతంలో ప్రేమించుకున్నారు. కొద్దిరోజుల కిందటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఉప్పల్ లో ఇద్దరూ ఎదురుపడిన సందర్భంలో మాట మాట పెరిగి ఘర్షణ జరిగింది. నన్ను ప్రేమించాలి అంటూ అమ్మాయిపై కత్తితో దాడి చేసినట్టు స్తానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం యువతిని హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.