తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రజలు పండుగలకు సొంతూర్లకు వెళ్లగా ఇదే అదునుగా భావించిన దుండగులు పలు ఇండ్లలో చొరబడి అందినకాడికి దండుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..తెల్లాపూర్ మున్సిపాలిటీ పోచారంలో మూడు ఇండ్లలో దొంగలు చొనబడ్డారు. 6 తులాల బంగారం, ఓ ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.