ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం మేరికపూడి సమీపంలో ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అన్నవరం పుణ్యక్షేత్రం సందర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉండగా..వీరంతా రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు కాలువలో పడి ఒక వైపుకు పూర్తిగా ఒరిగిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి .క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు పోలీసులు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.