Fraud : బైబ్యాక్ పాలసీ, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో రూ. 300 కోట్లకు టోకరా

Update: 2024-11-15 16:45 GMT

బైబ్యాక్ పాలసీ, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది నిందితు లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తామని 3,600 మంది నుంచి సుమారు రూ. 300 కోట్లను కాజేసినట్లు గుర్తించారు. పవన్ కుమార్ అనే వ్యక్తి మరో ఏడుగురి తో కలిసి వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించా డు. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ. 15 వేలు చొప్పున 19 నెలలు చెల్లిస్తామని నమ్మించారు. చివరి నెలలో పెట్టుబడి పెట్టిన రూ.5 లక్షలు తిరిగి ఇస్తామని వసూలు చేశారు. రూ. 8 లక్షలు చివరిలో తీసుకోవాల ని ముఠా సభ్యులు బాధితులకు చెప్పారు. దీ నికితోడు 25 నెలలకు గాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీం ప్రారంభించి పెట్టుబడిదారులు దగ్గర నుంచి పెద్దఎత్తున సొమ్మును రాబట్టా డు. రూ.8 లక్షలకు రెండు గుంటల భూమి కొనుగోలు చేయించి.. ప్రతినెలా నాలుగు శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం చేసు కున్నారు. ఇలా దాదాపు 3,600 మంది వద్ద నుంచి రూ.300 కోట్లు దండుకుని బురిడీ కొ ట్టించారు. కొన్నాళ్ల తర్వాత లాభాలు ఇవ్వకపోవడం, పవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రా కపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 8 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News