Banjara Hills: రోడ్డు మధ్యలో మొక్కలకు నీరు పోస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి..
Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది.;
Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు మధ్యలో ఉన్న మొక్కలకు నీరు పోస్తుండగా కిరణ్ అనే యువకుడిని వేగంగా వచ్చి ఢీకొట్టిందో కారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని పార్క్ హయత్ హోటల్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. కిరణ్ గత కొద్ది రోజులుగా జీహెచ్‌ఎంసీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.