ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి 8 ఏళ్ల బాలిక మరణించింది. మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ-సుధారాణి దంపతులకు అంజలి కార్తీక(8) అనే కూతురు ఉంది. తడిచేతులతో ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టడంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించినట్లు చెప్పారు. కాగా అంజలి ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. 8 ఏళ్ల పాప కళ్లముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు