TG : రూ. 50 లక్షల విలువైన సిగరెట్ డబ్బాలు చోరీ

Update: 2024-10-21 11:15 GMT

జడ్చర్ల పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గోడౌన్లో చోరీకి పాల్పడి సుమారు 50 లక్షల విలువైన సిగరెట్ కాటన్ లతో పరారయ్యారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఐటీసీ గోడౌన్ లో తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు గోడౌన్ లోకి చొరబడ్డారు. సెటర్ లాకును విరగొట్టి గోడౌన్ లో ఉన్న డోర్ లాక్ ను కూడా పగులగొట్టి సుమారు 50 లక్షలు విలువైన సిగరెట్ కాటన్ లను ఎత్తుకెళ్లారు. ఓ ప్రత్యేక వాహనంలో సిగరెట్ కాటన్ లను లోడ్ చేసి అక్కడ నుంచి దుండగులు వాహనంతో పరారయ్యారు. పక్కనే ఉన్న మరో కిరాణం షాపు యజమాని గుర్తించి గోడౌన్ యజమాని మణికర్ కు సమాచారం ఇచ్చాడు. దాంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News