Hyderabad: స్కూలు విద్యార్థుల మధ్య గొడవ.. మృతికి దారితీసింది..
Hyderabad: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ.;
Hyderabad: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తీవ్ర విషాదానికి దారికి తీసింది. ఇద్దరు విద్యార్థులు దారుణంగా కొట్టుకున్నారు. వాటర్ బాటిల్స్‌తో విచక్షణారహితంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మన్సూర్ అనే విద్యార్థిని మరో నలుగురు చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన మన్సూర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. క్లాస్ రూంలో క్రికెట్ ఆడుతుండగా గొడవ జరిగినట్లు అక్కడి విద్యార్థులు చెబుతున్నారు.