హోటల్‌లో గొడవ.. ప్రాణం తీసిన బిర్యానీ..
పంజాగుట్టలోని ఓ హోటల్‌లో బిర్యానీ విషయమై హోటల్ కార్మికులతో వాగ్వాదానికి దిగిన ఓ కస్టమర్‌ను కొట్టి చంపారు.;
పంజాగుట్టలోని ఓ హోటల్‌లో బిర్యానీ విషయమై హోటల్ కార్మికులతో వాగ్వాదానికి దిగిన ఓ కస్టమర్‌ను కొట్టి చంపారు. పంజాగుట్టలోని ఓ హోటల్‌లో బిర్యానీ విషయంలో హోటల్ కార్మికులతో వాగ్వాదం జరగడంతో కస్టమర్‌ను కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్టకు చెందిన బాధితుడు లియాఖత్ (30) ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్‌కు ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశాడు.
వారు భోజనం చేస్తుండగా, హోటల్ సిబ్బందికి, లియాఖత్‌కు మధ్య వాగ్వాదం జరగడంతో ఇతర హోటల్ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. చివరకు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. హోటల్ సిబ్బంది షట్టర్లు మూసివేసి లియాఖత్, అతడి స్నేహితులపై దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
లిఖాయత్ చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.