Drugs : చెన్నైలో రూ.110కోట్ల డ్రగ్స్ స్వాధీనం

Update: 2024-09-28 11:15 GMT

చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణ తేలింది. దీంతో ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

Tags:    

Similar News