Adilabad: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా కలెక్టర్ డీపీతో వల..
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి జిల్లా అధికారుల వరకు ఎవ్వరిని వదలడం లేదు.;
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి జిల్లా అధికారుల వరకు ఎవ్వరిని వదలడం లేదు. అధికారులే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్ల పేరును వాడుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తమ వాట్సాప్ నెంబర్‌కు కలెక్టర్ డీపీ పెట్టుకొని అధికారులకు వల వేయడం కలకలం సృష్టించింది. కొన్నిరోజుల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్, నిన్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్... ఇవాళ కొమురం భీమ్ కలెక్టర్ ఫోటోలతో అధికారులకు సైబర్ నేరగాళ్లు ఎరవేయడం అలజడి సృష్టిస్తోంది. దీంతో మూడు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. నేరగాళ్ల ఎత్తులను అడ్డుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మాప్రతినిధి వేణు అందిస్తారు.