DAV School Issue: నిందితులు చంచల్‌గూడ నుంచి బంజారాహిల్స్‌కు..
DAV School Issue:;
DAV School Issue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన DAV పబ్లిక్ స్కూల్ ఘటనలో నిందితులను కస్టడిలోకి తీసుకోనున్నారు పోలీసులు. నిందితులను చంచల్‌గూడ నుంచి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి 4 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు.
DAV పబ్లిక్ స్కూల్ లో LKG బాలికపై కార్ డ్రైవర్ రజినీకుమార్ గత రెండు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్ , ఆమె డ్రైవర్ పై పోక్సో కేసు పెట్టారు.
మరెవైపు డీఏవీ స్కూల్ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు కొనసాగించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. ఇప్పటికిప్పుడు స్కూల్ ను రద్దు చేస్తే తమ పిల్లల్ని ఎక్కడ చదివించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేరే పాఠశాలకు పంపుదామంటే సిలబస్ తోపాటు అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.