Srisailam : శ్రీశైలంలో భక్తులకు టోకరా.. గర్భాలయ అభిషేకం చేయిస్తానని

Update: 2025-07-15 07:45 GMT

శ్రీశైలంలో భక్తులకు టోకరా వేశాడో దుండగుడు. గర్భాలయ అభిషేకం చేయిస్తానని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశాడు స్థానిక యువకుడు పవన్, హైదరాబాద్ కు చెందిన 3 కుటుంబాల నుంచి రూ.5 వేల చొప్పున డబ్బులు వసూలు చేశాడు. రూ.150 టికెట్లు తీసుకుని భక్తులను ఆలయంలోకి తీసుకెళ్లాడు. ఆలయంలోపల టికెట్లు తనిఖీ చేసి మోసం చేసిన యువకుడిని ఆలయ ఏఈఓ హరిదాస్ పట్టుకున్నారు. యువకుడు పవన్ ను పోలీసులకు అప్పగించింది దేవస్థానం సిబ్బంది, మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు శ్రీశైలం పోలీసులు, సిఎస్ఓ మల్లికార్జున ఫిర్యాదుతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరోవైపు శ్రీశైలంలో ఉచిత దర్శనం తాత్కాలికంగా రద్దు చేయబడింది. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనం జూలై 15, 2025 (మంగళవారం) నుండి జూలై 18, 2025 (శుక్రవారం) వరకు నిలిపివేయబడింది. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో భక్తులు మరియు పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, దర్శనాల నిర్వహణ సజావుగా కొనసాగించడానికి మరియు ఆలయంలో భక్తుల కదలికలను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News