హన్మకొండలో అబార్షన్లు చేస్తున్న డాక్టర్ సబిత అరెస్ట్..!
హన్మకొండలో నిబంధనలను ఉల్లంఘిస్తూ అబార్షన్లు చేస్తున్న డాక్టర్ సబితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరిస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.;
హన్మకొండలో నిబంధనలను ఉల్లంఘిస్తూ అబార్షన్లు చేస్తున్న డాక్టర్ సబితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరిస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్... నిత్యశ్రీ పాలీ క్లినిక్ నిర్వాహకుడిగా గుర్తించారు. డాక్టర్ సరిత హన్మకొండలోని కాకాజీ కాలనీలో గది అద్దెకు తీసుకుని అబార్షన్లకు అడ్డాగా మార్చినట్టు పోలీసులు తెలిపారు. అబార్షన్ల కేంద్రంపై పోలీసులు, వైద్యాధికారులు దాడి చేశారు. అబార్షన్ల కోసం 9 మంది మహిళలు వచ్చినట్టు గుర్తించారు.