Eluru : ఏలూరులో అర్ధరాత్రి వరుస దొంగతనాలు
గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్న ఏలూరు పోలీసులు?;
ఏలూరులో గురువారం అర్దరాత్రి పలు వరుస చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు దొంగలు. అర్ధరాత్రి ఏలూరులో నగరంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు నగరంలోని చర్చిలు, ఆలయాల హుండీలను పగల గొట్టి నగదు దోచుకున్నారు.
అయితే సమాచారం అందుకున్న ఏలూరు పోలుసులు ప్రాధమిక విచారణ అనంతరం నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఎన్ని చోట్ల వీళ్ళు చోరీలకు పాల్పడ్డారు అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
అయితే చోరీలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు ఏలూరు ప్రజల్లో భరోసాని పెంచింది.
ఇప్పటికే జిల్లాలో రాత్రి గస్తీపై సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ మేరీ ప్రశాంతి తాజాగా రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయనున్నారు..