Mulugu: మావోయిస్టుల ఘాతుకం.. మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్.. ఆపై హత్య..
Mulugu: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.;
Mulugu: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.. మాజీ సర్పంచ్‌ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.. ఇన్‌ఫార్మర్ నెపంతో మాజీ సర్పంచ్ రమేష్‌ను రాత్రి ఎత్తుకెళ్లారు.. ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దు అడవుల్లో రమేష్‌ను హత్య చేసిన మావోయిస్టులు ఆ తర్వాత లేఖను విడుదల చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే పథకంలో భాగంగానే మాజీ సర్పంచ్ రమేష్ ఇన్‌ఫార్మర్‌గా మారాడని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.. రమేష్‌కి వెంకటాపురం ఎస్సై భూక్య తిరుపతి మూడుసార్లు 35వేల రూపాయలు ఇచ్చారన్నారు..
పాలపొడిలో విషం కలిపి రమేష్‌తో పంపించారని.. ఆ పాలపొడి తాగి ఒక కామ్రెడ్ అనారోగ్యానికి గురయ్యారని అన్నారు.. ఒక కామ్రెడ్ అమరుడయ్యాడని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.. రమేష్ ఒక ఎన్‌కౌంటర్ చేయించాడని అందుకే హత్య చేసినట్లు మావోయిస్టులు వెల్లడించారు..