ORR : ఇలా కూడా ప్రమాదం జరగొచ్చు... రాజేంద్రనగర్ ఓఆర్ఆర్‌పై బీభత్సం

Update: 2024-03-11 08:43 GMT

ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలకు నియంత్రణ లేకపోవడంతో దారుణాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డు పై టస్కర్ వాహనం బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఒకరు చనిపోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలను పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ వెస్ట్ వైపు రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డుపై టస్కర్ వాహనం బీభత్సం సృష్టించింది. హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్ద ఆగి ఉన్న ఓ కారును టస్కర్ ఢీ కొట్టింది. ఈ టైంలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులు సిటీ నుంచి గోవాకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టస్కర్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల కారు అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీకొట్టిందని తెలుస్తోంది. సీసీ పుటేజ్.. సాక్ష్యులను విచారించిన పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News