హైదరాబాద్ లో మరో హత్య జరిగింది. సనత్ నగర్ లో ఈ హత్య సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సనత్ నగర్ పరిధి ఏజీ కాలనీలోని నేతాజీనగర్ వాసి అజార్ (22), ఎర్రగడ్డ వాసి ఆసిఫ్ (23) తోడు దొంగలు.
ఈ ఇద్దరు రాత్రి ఇద్దరు మద్యం తాగి భరత్ నగర్ MMTSరైల్వే స్టేషన్ వెనుక పొదల్లోకి వెళ్లారు. ఇటీవల చేసిన చోరీకి సంబంధించి సొత్తు పంపకాల విషయంలో వారు ఘర్షణ పడ్డారు.
అజార్ను ఆసిఫ్ కత్తితో పొడిచాడు.రాళ్లతో తలపై కొట్టి చంపి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.