POCSO Case : కన్న కూతుళ్ళతో కామ వాంఛ.. కామాంధుడిపై ఫోక్సో కేసు

Update: 2025-01-07 12:30 GMT

సభ్య సమాజం తలదించుకునేలా కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే ఆ చంటి పిల్లల్ని కాటేయబోయాడు. ఏం జరుగుతోందో కూడా తెలియని పసి పిల్లలను తన కామవాంఛ కోసం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాడు. కనీసం వారి మీద జరుగుతున్నది లైంగిక దాడి అనే సంగతి కూడా తెలియని పసి హృదయాలు కడుపు నొప్పితో అల్లాడుతుండగా కారణాలు తెలుసుకునే క్రమంలో అసలు విషయం బయటికి వచ్చింది. కన్న తండ్రి తమపట్ల చేసిన వికృత చేష్టలు తెలిసి స్థానికులు నిర్ఘాంతపోయారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో కట్టుకున్న ఇల్లాలు నీఛుడైన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. మదనపల్లె తాలూక రూరల్ సర్కిల్ సిఐ రమేష్ తెలిపిన వివరాల మేరకు..... నిమ్మనపల్లె మండలం, కొండయ్య గారిపల్లె పంచాయతీ, వెంకోజిగారిపల్లి దాసరిపేటలో ఉండే బోయకొండ(28) కు భార్య చిట్టెమ్మ, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. భార్య చిట్టెమ్మ పగలంతా గాజులమ్మే పని చేసుకుని ఎప్పుడో ఇంటికి చేరుకుంటుంది. బోయకొండ మద్యానికి బానిసై ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈక్రమంలో 9,7 ఏళ్ల వయస్సు ఉన్న వీరి ఇద్దరి కూతుళ్లపై బోయకొండ గత కొన్ని రోజులుగా తన కామ వాంఛ తీర్చుకుంటున్నట్లు పిల్లల ద్వారా తెలుసుకున్న భార్య చిట్టెమ్మ నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదుచేయగా మదనపల్లె తాలూకా పోలీసులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశామన్నారు.

Tags:    

Similar News