Crime News: కూతురు ప్రేమ వ్యవహారం నచ్చలేదని ప్రాణం తీసిన తండ్రి..
Crime News: కన్నపేగు మీద కనికరం లేకుండా పోతోంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలు ఎందుకూ కొరగాని వారుగా తయారవుతుంటే చూస్తూ ఊరుకోలేపోతున్నారు.;
Crime News: కన్నపేగు మీద కనికరం లేకుండా పోతోంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలు ఎందుకూ కొరగాని వారుగా తయారవుతుంటే చూస్తూ ఊరుకోలేపోతున్నారు. మొన్నటికి మొన్న కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడని కొడుకుని రూ.8 లక్షలు సుపారీ ఇచ్చి మరీ చంపించేశారు తల్లిదండ్రులు.
ఇప్పుడు మరో సంఘటన.. పదో తరగతి చదువుతున్న కూతురు ప్రేమ దోమ అంటూ తిరుగుతోందని, ఎంత చెప్పినా వినట్లేదని కన్నతండ్రి ఆమెను హతమార్చాడు.
విశాఖ కేజీహెచ్ కాలనీకి చెందిన వడ్డాది వరప్రసాద్ వ్యాను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. భార్యతో విభేదాలు వచ్చి విడిపోయాడు. కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. పెద్దకూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. రెండవ కుమార్తె లిఖిత శ్రీ పదవతరగతి చదువుతోంది. ఆమెను బాగా చదివించాలనుకున్నాడు.
కరాటే కూడా నేర్పించాడు. లిఖిత తన సహ విద్యార్థితో ప్రేమలో పడిందని తెలుసుకుని హెచ్చరించాడు. అయినా తండ్రి మాట వినకుండా అతడితోనే తిరుగుతోంది లిఖిత. దీంతో వరప్రసాద్ కూతుర్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజే అతడి తల్లి వర్ధంతి కూడా.. కూతుర్ని గొంతు పిసికి చంపేశాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపాడు. కూతుర్ని చంపిన తరువాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
-