Hyderabad : సీతమ్మ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు పెట్టిన కరాటే కల్యాణి...!
చిల్లర చేష్టలు, వెకిలి పనులు చేస్తే శిక్ష తప్పదని తెలిసినా ఓ కుర్రాడు వక్రబుద్ధితో దేవుళ్లను కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. శ్రీరామ నవమి రోజున సీతమ్మ తల్లిపై అసభ్య పదజాలంతో నోటికొచ్చింది రాశాడు. ఈ విషయం తెలిసి సినీ నటి కరాటే కళ్యాణి ఆ యువకుడు శ్రీకాంత్‌కి ఫోన్ చేసి వివరణ కోరారు. ఐతే.. అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా తనను, తన తల్లిని కూడా దూషించాడంటూ కరాటే కల్యాణి చెప్తున్నారు.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన సీతమ్మ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వాటిని సమర్థించుకుంటూ నీచంగా మాట్లాడాడని మండిపడ్డారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్టు జాయింట్ సీపీ భూపాల్ తెలిపారు. శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.