మంచిర్యాల రైల్వేస్టేషన్ లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల సీఐ బన్సీలాల్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బళ్ళార్ష కు చెందిన రిజ్వాన్ మంచిర్యాలలోని వెంకటేష్, భూక్యా సారయ్య, ఆలమేకర్ శ్యామ్ లను రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. రిజ్వాన్ మంచిర్యాల లోని ముగ్గురి వ్యక్తుల కు గంజాయి రవాణా చేస్తున్నాడని తెలిపారు. నిందితుల నుంచి ఎనిమిది వేల రూపాయల విలువ గల గంజాయి, నాలుగు వేల నగదు ,నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి అమ్మడం కాకుండా సేవించే వారని వారి సెల్ ఫోన్ లో నంబర్ లు పరిశీలించగా మంచిర్యాల, సీసీసీ, శ్రీరాంపూర్, గోదావరిఖని కి చెందిన అనేక మంది గంజాయి మత్తుకు అలవాటు పడినట్లు తెలిసిందని వివరించారు. నిందితులను అరెస్టు చేది కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.