Nayeem Crimes : గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్..
Nayeem Crimes : గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదారాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు;
Nayeem Crimes : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన అతని ప్రధాన అనుచరుడు శేషన్నను హైదారాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైలెంట్‌గా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న శేషన్న.. కొత్తపేటలోని ఓ హోటల్‌లో సోమవారం అదుపులో తీసుకున్నారు. అతని వద్దనుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. 2016లో నయీం ఎన్‌కౌంటర్ తర్వాత శేషన్న అజ్ఞాతంలో వెళ్లిపోయాడు. దాదాపు ఆరేళ్లుగా శ్రీశైలం, సున్నిపెంట ఏరియాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు పోలీసులు. అతనికి షెల్టర్ ఇచ్చింది ఎవరూ అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నయీం డంప్ మొత్తం శేషన్న వద్దే ఉందన్న ప్రచారంతో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల అక్బర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని ఇచ్చిన సమాచారంతో... శేషన్నపై నిఘా పెట్టారు. నగరంలో ముగ్గురికి ఆయుధాలు అమ్మినట్లు తెలుస్తోంది. శేషన్నపై రెండు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయి. శేషన్నను ఇవాళ అరెస్ట్ చేసి చూపించే అవకాశాలున్నాయి.