Hyderabad Crime News : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య..
Hyderabad Crime News : హైదరాబాద్ మాదాపూర్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది;
Hyderabad Crime News : హైదరాబాద్ మాదాపూర్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకేసింది. కేబుల్ బ్రిడ్జిను చూడటానికి వచ్చిన సందర్శకులు... యువతి ఆత్మహత్యకు పాల్పడటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె కోసం స్పీడ్ బోట్లు, గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. యువతి స్వప్నగా గుర్తించారు.
యువతి స్వప్న కేబుల్ బ్రిడ్జిపై హ్యాండ్ బ్యాగ్, చెప్పులు విడిచి... పైనుంచి దూకడాన్ని అక్కడున్నవారు గమనించారు. అక్కడి చేరుకునే లోపే ఆమె దూకేసింది. యువతి స్వప్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.