ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న కోకాపేట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సైబరాబాద్ ఎకానమిక్స్ అఫెన్స్ వింగ్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 7 కోట్ల రూపాయల స్కామ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి EOW వింగ్ ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈఓడబ్ల్యూ అధికారులు ఆధారాలు స్వేకరించారు. చంద్రశేఖర్ పై నార్సింగీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో పలు సెక్షన్ ల కింద కేసులు నమోదయ్యాయి. మూడు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఫోన్ టాపింగ్ కేసు లో చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్నారు.