Suryapet : ఉపాధ్యాయుడి అంత్యక్రియల్ని అడ్డుకున్న గ్రామస్థులు.. కారణం ఏంటంటే..?

Suryapet : విజయరాఘవపురం గ్రామంలో అప్పుల బాధలు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Update: 2022-08-11 15:33 GMT

Suryapet : సూర్యపేట జిల్లా,మునగాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. విజయరాఘవపురం గ్రామంలో అప్పుల బాధలు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.గవర్నమెంట్‌ టీచర్‌గా పని చేస్తున్న నరేంద్రబాబు తన తెలిసిన వారి దగ్గర నుంచి, గ్రామస్తుల నుంచి దాదాపు పాతిక కోట్ల రూపాయల అప్పుచేశాడు. అయితే ఆప్పులు తీర్చకపోవడంతో గ్రామస్తుల ఒత్తిడి ఎక్కువకావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చాకే అంత్యక్రియలు జరపాలంటూ గ్రామస్తులు భారీ స్థాయిలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News