నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఊహించని 'షాక్'
Groom Dies Before Marriage: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ పెళ్లింట తీరని విషాదాన్ని నింపింది.;
ప్రతీకాత్మక చిత్రం
Groom Dies: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ పెళ్లింట తీరని విషాదాన్ని నింపింది. మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి.. కదిరి మండలం ఎరికిలవాండ్లపల్లిలో జాతీయ రహదారిపై బైక్ ఢీకొని మహేష్ అనే వ్యక్తి మృతిచెందాడు. ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన మహేష్‌కు తలుపుల మండలానికి చెందిన యువతితో ఈనెల 27న వివాహం జరగాల్సి ఉంది.. అందరూ పెళ్లిపనుల్లో నిమగ్నమై ఉన్నారు.. పెళ్లి పత్రికలు బంధువులకు పంచేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.. మృతుని కుటుంబాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.