Madhya Pradesh: "రేపిస్టులను బహిరంగంగా ఉరితీయండి": మంత్రి సూచన

Madhya Pradesh: ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు.. కానీ శిక్షలు పడేది ఎందరికి. కోర్టులు, చట్టాలు అంటూ సాగదీస్తారు.

Update: 2022-11-04 10:15 GMT

Madhya Pradesh: ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు.. కానీ శిక్షలు పడేది ఎందరికి. కోర్టులు, చట్టాలు అంటూ సాగదీస్తారు.. నేరం చేసిన వాడికి కూడా బెయిల్ దొరుకుతుంది. కొంచెమైనా పశ్చాత్తాపం లేకుండా జనం మధ్య తిరిగేస్తున్నాడు. ఇలా మన చుట్టూ ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్లకు నడిరోడ్డు మీద ఉరితీయడమే సరైన పరిష్కారం అని మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ అన్నారు.

ఈ వారం ప్రారంభంలో రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి ఈ ప్రకటన చేశారు.ఈ రకమైన శిక్షలు విధించడం వలన ఇతరులు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. అలాంటి నేరాలకు ఎవరూ సాహసించరు.

"మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి క్రూరమైన అంశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దేశంలోనే రేపిస్టులకు మరణశిక్ష విధించే నిబంధనను రూపొందించిన మొదటి రాష్ట్రం ఇదే. ఇప్పటివరకు 72 మంది నేరస్థులకు ఉరిశిక్ష విధించబడింది" అని సాంస్కృతిక శాఖా మంత్రి ఠాకూర్ అన్నారు.


ఇలాంటి నేరాలు పునరావృతం కావడం సమాజానికి, ప్రజాస్వామ్యంలోని ఫోర్త్ ఎస్టేట్‌కు, మీడియాకు, మనందరికీ ఆందోళన కలిగించే విషయమని ఆమె అన్నారు. "మనం వివిధ మార్గాల ద్వారా సమాజాన్ని జ్ఞానోదయం చేయాలి. ఎవరైనా ఇలాంటి అనాగరిక చర్యలకు ఎలా పాల్పడగలరు? అటువంటి నేరస్థులకు బహిరంగ కూడళ్లలో శిక్ష విధించాలని నేను ముఖ్యమంత్రి (శివరాజ్ సింగ్ చౌహాన్)కి అభ్యర్ధన చేస్తాను. నిందితుడికి మరణశిక్ష నాలుగ్గోడల మధ్య విధించబడుతుంది. ఆ విషయం ఎవరికీ తెలియదు.


"ఇటీవల ఇక్కడ జరిగిన అత్యాచార ఘటనలకు సంబంధించి పట్టుబడిన ఇద్దరు నేరస్థులను ఒక కూడలిలో బహిరంగంగా ఉరితీస్తే, మరొకడు ఆడపిల్లలను తాకే ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తారు" అని శ్రీమతి ఠాకూర్ అన్నారు.


ఇటీవల జరిగిన సంఘటనలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో కనిపించిన చిన్నారి ఇండోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారి తెలిపారు.


ఆ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేయగా, మరొకరు జిల్లాలో వేరే అత్యాచారం కేసులో పట్టుబడ్డారు.

Tags:    

Similar News