Head Constable Suicide : అప్పుల బాధతో హెడ్ కానిస్టేబుల్ సూసైడ్
అప్పుల బాధ తట్టుకోలేక ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్‌కు చెందిన బత్తిని మనోహర్ (55) జిల్లా పోలీస్ ఆఫీస్‌లోని కంట్రోల్‌రూమ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈయన పెద్దకొడుకు మధుకర్‌కు ఇటీవల పోలీస్ ఉద్యోగానికి ఎంపికై ట్రైనింగ్‌లో ఉన్నాడు. రెండో కుమారుడు శ్రీకర్‌ను ఆస్ట్రేలియా పంపేందుకు కొంత మొత్తం అప్పు చేశాడు. అప్పులు మొత్తం రూ. 10 లక్షలకు చేరుకోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం తెల్లవారుజామున నర్సింహానగర్ సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చి మనోహర్ డెడ్‌బాడీకి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ వెల్ఫేర్ తరఫున రూ. 20 వేలు అందజేశారు.