Crime : పల్నాడు జిల్లాలో దారుణం..దంపతులపై పోట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Update: 2025-07-16 11:30 GMT

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. ఇంటిముందు నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. నీలబోయిన పెద్ద శ్రీను, మంగమ్మలపై దుండగులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ్ముడి కొడుకుపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ గోడ విషయంలో అన్న, తమ్ముడు కొన్నాళ్లుగా గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News