Delhi : ఢిల్లీలో దారుణం.. తిట్టారనే కోపంతో.. తల్లీకొడుకు హత్య

Update: 2025-07-04 09:15 GMT

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. లజపత్‌ నగర్‌లో తల్లీకొడుకు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపిది. కుల్ దీప్ సేవాని తన భార్య రుచికా, కొడుకు క్రిష్ లతో కలిసి లజపత్ నగర్ లో నివసిస్తున్నాడు. వారికి బట్టల బిజినెస్ ఉంది. బుధవారం రాత్రి కుల్దీప్ ఇంటికి రాగా భార్యాకొడుకు ఎంతకు డోర్ తీయ్యలేదు. మెట్ల వద్ద రక్తపు మరకలు కనిపించగా.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులతో కలిసి లోపలికి వెళ్లి చూడగా.. రుచికా, క్రిష్ శవాలై ఉన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కుల్దీప్ ఇంట్లో హార్ కు చెందిన ముఖేష్ పనిచేస్తున్నాడు. అతడు రుచికా దగ్గర 40వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అది తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె అందరి ముందు తిట్టింది. దీనిని మనసులో పెట్టుకున్న ముఖేష్.. రుచికాను దారుణంగా చంపేశాడు. అడ్డొచ్చిన కొడుకును సైతం హత్య చేశాడు. ఆ తర్వాత తన సొంతూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తిట్టారనే కోపంతోనే హత్యలు చేసినట్లు విచారణలో ముఖేష్ ఒప్పుకున్నాడు.

Tags:    

Similar News