HYD COMPANY FRAUD: హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..30 కోట్లు లూటీ..
HYD COMPANY FRAUD: హైదరాబాద్ లో ఘరానా మోసం బయటపడింది. ఉద్యోగాల పేరుతో డిజిటల్ ఇండియా కంపెనీ 30 కోట్లు ఫ్రాడ్ చేసింది.;
HYD PVT COMPANY FRAUD: నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశలు చూపి కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేసిన డిజిటల్ ఇండియా కంపెనీ మోసాలు బట్టబయలయ్యాయి. 700 మంది నుంచి 30 కోట్ల మేర డిపాజిట్ కట్టించుకుని డిజిటల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ చీట్ చేసింది. తమది యూఎస్ బేసిడ్ కంపెనీ అని.. నెలకు మూడు లక్షలపైనే జీతం ఇస్తామని నిరుద్యోగులకు నమ్మించింది. ఆన్‌లైన్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు చేసుకుంటే చాలని తెలిపింది. ఐదు లక్షల 50 వేలు డిపాజిట్ చేస్తే.. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని అమాయకుల నుండి 30 కోట్ల వరకు కట్టించుకున్నారు. అయితే ఆ తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. డిజిటల్ ఇండియా కంపెనీ ఎండీపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.