L.B.నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం..20 కార్లు దగ్ధం

కార్ ఓ మ్యాన్ అనే కారు గ్యారేజీలో భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి

Update: 2023-05-31 08:00 GMT

హైదరాబాద్ L.B.నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్ ఓ మ్యాన్ అనే కారు గ్యారేజీలో భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పుతున్న సమయంలో రెండు సిలిండర్లు పేలిపోయాయి. భారీ పేలుడుతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో 20కి పైగా సెకెండ్ హ్యాండ్ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాలిపోయిన కార్ల విలువ దాదాపు మూడు కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News