Meerpet Cooker Murder : భార్య హత్య పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుడు
మీర్‌పేట్‌లో భార్యను చంపి, శరీరాన్ని ముక్కలు చేసి మాయం చేసిన భర్త. ఆధారాలు లేకున్నా నేరం ఒప్పుకున్న నిందితుడు పోలీసులకు సవాల్ విసురుతున్నాడు.;
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసు పోలీసులను సవాలు చేస్తోంది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి, ఆధారాలు లేకుండా మాయం చేశాడు, ఈ కేసులో నిందితుడి తెలివితేటలు, పోలీసుల దర్యాప్తు విధానం ఉత్కంఠను రేపుతున్నాయి.
వెంకటేశ్వర నగర్ కాలనీలో గురుమూర్తి, అతని భార్య వెంకట మాధవితో కలిసి జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంక్రాంతి రోజున భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో మాధవి తన తాళిని గురుమూర్తి ముఖంపై విసిరింది. కోపంతో గురుమూర్తి ఆమెను గోడకు కొట్టాడు. మాధవి అక్కడికక్కడే మరణించింది.
నేరాన్ని కప్పిపుచ్చడానికి గురుమూర్తి ఒక పథకం వేశాడు ఇంట్లోని కత్తులతో మాధవి శరీరాన్ని ముక్కలుగా కోసి, వాటర్ హీటర్‌లో ఉడికించాడు శరీరం యొక్క అవశేషాలను, ఎముకల పొడిని చెరువులో పడేశాడు,రక్తపు మరకలను ఫినాయిల్‌తో శుభ్రం చేశాడు.
ఈనెల 18న మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీ ఫుటేజ్‌లో మాధవి ఇంటికి వెళ్లినట్లు, తిరిగి రాలేదని గుర్తించారు కానీ గురుమూర్తి మాత్రం అనేకసార్లు బయటికి వెళ్లినట్లు కనిపించింది.
పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు అయితే తనపై ఎటువంటి ఆధారాలు లేవని, కోర్టులో తప్పించుకుంటానని పోలీసులను బెదిరిస్తున్నాడు. గురుమూర్తి ప్రవర్తన పోలీసులకు సవాలుగా మారింది.
గురుమూర్తి ఇంట్లో వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. చెరువులో కూడా గాలించినప్పటికీ, ఎటువంటి ఆధారాలు లభించలేదు.
శరీరం లేకుండా, ఆధారాలు లేకుండా ఈ కేసును ఎలా పరిష్కరిస్తారనేది పోలీసులకు పెద్ద ప్రశ్నగా మారింది. గురుమూర్తి నేరాన్ని అంగీకరించినప్పటికీ, అతనిని దోషిగా నిరూపించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ కేసు మీర్‌పేట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.