ఇంటర్‌లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చొప్పదండి చంద్రప్రకాశ్ (20) ఇంటర్ ఎంపీసీ చదివాడు. ఇప్పటికే రెండు సార్లు ఫెయిల్ అయిన చంద్రప్రకాశ్ ఇటీవల మరోసారి ఎగ్జామ్స్ రాయగా పాస్ కాలేదు.
దీంతో మనస్తాపానికి గురైన అతడు ఈ నెల 17న ధరూర్ గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే జగిత్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని దవాఖానాకు తీసుకువెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం చనిపోయాడు. మృతుడి బాబాయ్ ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.