కబాలి తెలుగు నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో డ్రగ్స్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. 82 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 78 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. 2లక్షల నగదు కూడా సీజ్ చేశారు. కృష్ణ ప్రసాద్ స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్. బీటెక్ చదివి పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన ఆయన 2016లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. పలు, తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ పనిచేశారు. అనుకున్నంతగా లాభాలు రాకపోవడంతో ఆయన డ్రగ్స్ సరఫరాలోకి దిగినట్లు పోలీసులు అంటున్నారు.