Karnataka: అమ్మకి ఏమైంది.. బిడ్డను చంపేసి తానూ ఆత్మహత్య..
ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆమె భర్త రాత్రి షిఫ్ట్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఊహించని సంఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలోని శివమొగ్గలో 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సుల క్వార్టర్స్‌లో జరిగింది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రుతి భర్త రాత్రి పని తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు ఎంత కొట్టినా తీయక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశాడు.
భార్య, కూతురు ఇద్దరూ శవాలుగా కనిపించారు. 6వ తరగతి చదువుతున్న తన కుమార్తె పూర్విక తలకు గాయాలై కనిపించింది. శ్రుతి తన కూతురు శరీరంపై వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం శ్రుతి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు హత్య, అసహజ మరణం కింద కేసు నమోదు చేసి, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.