Crime News: మూఢనమ్మకాలకు ఇద్దరు మహిళలు బలి..

Crime News: కేరళ రాష్ట్రంలో కొందరు మూఢనమ్మకాలను నమ్మి ఇద్దరు అమాయక మహిళల జీవితాలను బలిగొన్నారు.;

Update: 2022-10-12 06:50 GMT

Crime News: కేరళ రాష్ట్రంలో కొందరు మూఢనమ్మకాలను నమ్మి ఇద్దరు అమాయక మహిళల జీవితాలను బలిగొన్నారు. కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను తిరువళ్లకు తీసుకొచ్చి మంత్రతంత్రాలతో బలి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఏజెంట్, దంపతులను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్‌గా గుర్తించారు.

నిందితుడు రషీద్.. భగవాల్ సింగ్, లైలా అనే దంపతులను నమ్మించి ఇద్దరు మహిళలను బలిస్తే మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయని మాటలతో నమ్మించారు. ఈ ఇద్దరు మహిళలు జీవనోపాధి కోసం లాటరీ టికెట్లు అమ్ముకునే వారని పోలీసులు తెలిపారు. అందులో ఒక మహిళ అయిన రోసిలి జూన్ లో కనిపించకుండా పోయింది.దీనితో ఆమె కూతురు ఆగష్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మిగిలిన మరో మహిళా పద్మము మిస్సింగ్ కాగా ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న కడవంతర పోలీసులు విచారణ ప్రారంభించారు.

నిందితులు తమ పథకంలో భాగంగా దంపతులు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పలు రకాల్లో విచారణ చేయగా నరబలి విషయం బయటకు వచ్చింది. వారిని బలి ఇచ్చిన తరువాత ఇద్దరి మృతదేహాలను పూడ్చిపెట్టారు నిందితులు . ఇప్పటి వరకు ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్షరాస్యత ఎక్కువ గల కేరళలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News