Alur Kurnool: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.. రోజుల వ్యవధిలోనే ప్రేమికుల ఆత్మహత్య..
Alur Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో విషాదం చోటు చేసుకుంది.;
Alur Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపిన మరుసటి రోజే యువతి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఐటీఐ చదువుతున్న విజయ్... కడప జిల్లాలో బీటెక్ చదువుతున్న యువతి.. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో విజయ్ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ బాధను జీర్ణించుకోలేక యువతి కూడా సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుంది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో శోకసంద్రంలో మునిగాయి.